బీహార్‌లో పరువు హత్య.. చెల్లెలి ప్రియుడిని నరికి చంపి కుక్కలకు ఆహారంగా వేసిన యువకుడు!

27-12-2022 Tue 08:08 | National
Advertisement
  • నలంద జిల్లాలో ఘటన
  • యువకుడిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి నరికి చంపిన నిందితుడు
  • పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించిన వైనం
Advertisement
బీహార్‌లో దారుణం జరిగింది. తన సోదరి ప్రేమించిన యువకుడిని ముక్కలుగా నరికి చంపిన వ్యక్తి ఆపై ఆ భాగాలను కుక్కలకు ఆహారంగా వేశాడు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన నలంద జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బిట్టు కుమార్ అనే యువకుడు ఈ నెల 16న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రెండు రోజుల తర్వాత 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

ఈ క్రమంలో రాహుల్ అనే యువకుడిపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బిట్టు తన సోదరితో సన్నిహితంగా ఉండడం చూసి తట్టుకోలేకపోయానని, అందుకనే అతడిని మట్టుబెట్టానని చెప్పుకొచ్చాడు. ఈ నెల 16న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి చంపేశానని అంగీకరించాడు. ఆ తర్వాత శరీరాన్ని ముక్కలుగా నరికి కుక్కలకు ఆహారంగా వేశానని, మిగతా వాటిని నదిలో పడేశానని చెప్పాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
BiharNalandaCrime News

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more